శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (13:23 IST)

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువ హీరో... రూ.5 వేల అపరాధం

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వీటిని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో పెద్దగా మార్పు రావడంలేదు. తాజాగా సినీ హీరో ప్రిన్స్ డ్రంకెన్ డ్రైవ్‌లో అడ్డంగా బుక్ అయ్యాడు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికాడు. అయితే, ఈ ఘటన ఈ నెల 24వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
డ్రంకెన్ డ్రైవ్ కేసు నేపథ్యంలో మంగళవారం కూకట్‌పల్లి 4వ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టుకు హీరో ప్రిన్స్ హాజరయ్యాడు. అతనికి కోర్టు రూ.5 వేల అపరాధం విధించింది. డ్రంకెన్ డ్రైవ్‌లో తొలిసారి పట్టుబడటంతో... కేవలం తక్కువ జరిమానాతోనే సరిపెట్టారు. లేకపోతే మరింత ఎక్కువ జరిమానాతో పాటు... జైలు శిక్ష పడి ఉండేది.