గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (16:34 IST)

అట్టహాసంగా విశాల్, అనీశా రెడ్డి నిశ్చితార్థం.. ఆ భవనంలోనే పెళ్లి?

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డితో పందెంకోడి హీరో విశాల్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో అనీశా రెడ్డి తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ 'అయోగ్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 
రెండు రోజుల క్రితం తమిళ హీరో ఆర్య.. బాలీవుడ్ నటి సాయేషా సైగల్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం విశాల్, అనీశా రెడ్డి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇవాళ పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే వివాహతేదిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 
 
నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం అయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ చాలా సార్లు ప్రకటించాడు. త్వరలో భవనం నిర్మాణం కూడా పూర్తికానుందని తెలుస్తోంది. ఈ భవనంలోనే విశాల్ పెళ్లి జరుగనుందని టాక్ వస్తోంది.