శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా భళా తందనాన విడుదల
Srivishnu, Katherine Theresa
హీరో శ్రీవిష్ణు 'భళా తందనాన' టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రాని దర్శకత్వం వహిస్తుండగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.
టీజర్, లిరికల్ వీడియోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన భళా తందనాన చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. వేసవి సెలవులను ద్రుష్టిలో పెట్టుకొని వచ్చే వారంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అలాగే మే 3న రంజాన్ పండగ కూడా సినిమాకు మరో అడ్వాంటేజ్ కానుంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.
తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.