శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (13:30 IST)

నాలో అప‌రిచితుడున్నాడు - శ్రీ‌విష్ణు

Sri vishnu
క‌థానాయ‌కుడు శ్రీ‌విష్ణు కాస్త నెమ్మ‌ది. ఎటువంటి విష‌యాన్ని అయినా చాలా చ‌క్క‌గా నిదానంగా అర్థ‌మ‌య్యేట్లుగా మాట్లాడుతుంటాడు. దానికితోడు సిగ్గ‌రి కూడా. సినిమాల్లోకి వ‌చ్చాక అన్ని ర‌కాలుగా బిహేవ్ చేయాల్సి వ‌స్తుంది. దాదాపు ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాలన్నీ చాలా సాఫ్ట్ కేరెక్ట‌ర్‌లు ప్లే చేశాడు. తాజాగా అర్జుణ ఫ‌ల్గుణ సినిమాలోకూడా ఆయ‌న అలాంటి పాత్రే చేశాడు.
 
కానీ త‌న‌లో ఓ అప‌రిచితుడు వున్నాడంటూ నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించారు. నేను పైకి ఎంత ఒబీడియంట్‌గా వుంటానే అవ‌స‌ర‌మొస్తే తాట‌తీస్తాన‌నే లోప‌ల అనిపిస్తుంది. అందుకే నాకు యాక్ష‌న్ సినిమాలు చేయాని వుంటుంది. దానికి త‌గిన‌ట్లుగా క‌థ‌ను తీసుకుని వ‌స్తే నేను చేస్తానంటూ వెల్ల‌డించారు. ఈనెల 31న విడుద‌ల‌కానున్న అర్జుణ ఫ‌ల్గుణలో న‌లుగురు కేరెక్ట‌ర్లు ప్ర‌ధానం. ద‌ర్శ‌కుడు తేజ ఒక‌రికి తెలీకుండా ఒక‌రికి నువ్వే హీరో అని చెప్పిన‌ట్లున్నాడు. అందుకే న‌లుగురం ఇందులో యాక్టింగ్ ఇర‌గ‌దీశామ‌ని తెలియ‌జేస్తున్నాడు.