శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (16:09 IST)

సన్నజాజి తీగలా మారిన అంజలి...

సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమలో బొద్దుగా ఉండే హీరోయిన్లకే మంచి అవకాశాలు వస్తుంటాయి. దీనికి మంచి ఉదాహణ ఖుష్భూ, నమితలను తీసుకోవచ్చు. అయితే దానికి పెద్దంత ప్రాధాన్యం ఇవ్వని ఓ పాపులర్ హీరోయిన్ స్లిమ్ కావడా

సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమలో బొద్దుగా ఉండే హీరోయిన్లకే మంచి అవకాశాలు వస్తుంటాయి. దీనికి మంచి ఉదాహణ ఖుష్భూ, నమితలను తీసుకోవచ్చు. అయితే దానికి పెద్దంత ప్రాధాన్యం ఇవ్వని ఓ పాపులర్ హీరోయిన్ స్లిమ్ కావడానికే మొగ్గు చూపింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. అంజలి. 
 
అచ్చతెలుగు ఆడపిల్లగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అంజలి.. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను దక్కించుకుంది. ఆ తర్వాత గ్లామర్ బ్యూటీగా మాస్‌లో క్రేజ్ సంపాదించుకుంది. 'షాపింగ్ మాల్', 'జర్నీ' వంటి సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి సక్సెస్ సాధించడంతో అమ్మడిపై ఇక్కడి నిర్మాతలూ కన్నేశారు. దాంతో తెలుగులోనూ సీనియర్ స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 
నిజానికి అంజలి తన శరీర ఫిట్నెస్‌పై పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. కానీ ఇప్పుడు వయసు మూడు పదులు దాటడంతో ఫిట్నెస్ విషయమై ఇపుడు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ ముద్దుగా, బొద్దుగా ఉన్న అంజలి గత కొంతకాలంగా స్లిమ్ అవుతోంది. అంతేకాదు అనుకున్న విధంగా సన్నబడింది కూడా. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారట.