శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (12:43 IST)

బర్త్‌డేకు శుభవార్త చెప్పిన నమిత...

Namita
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ నమిత. మంగళవారం తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ శుభవార్తను వెల్లడించారు. తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించిన నమిత.. తన బేబీ బంప్స్‌తో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను. నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు. మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇంతకుముందు ఎపుడూ లేని కొత్త ఫీలింగ్" అని నమిత తన పోస్టులో రాసుకొచ్చింది. 
 
కాగా, సొంతం సినిమాతో వెండితెరకు పరిచయమైన నమిత.. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌ నటించిన జెమిని, రవితేజతో ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల్లో నటించారు.