సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (10:30 IST)

రేవంత్ రెడ్డి ఫోటో వైరల్.. బక్కపలచగా..?

Revanth Reddy
Revanth Reddy
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు వివాహమై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దినేశ్ కుమార్‌... రేవంత్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
ఆ ఫొటోలో తన భార్యతో కలిసి నేలపై కూర్చుని ఉన్న రేవంత్ రెడ్డిని చూస్తే... టక్కున గుర్తు పట్టడం కష్టమే. పెళ్లయిన తొలి నాళ్లలో తీయించుకున్న ఆ ఫొటోలో రేవంత్ రెడ్డి చాలా బక్క పలచగా ఉన్నారు. 
 
నాడు రాజకీయాలతో సంబంధం లేకుండా సాగిన రేవంత్‌...ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్సీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. తాజాగా ఎంపీగా కొనసాగుతూనే టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు.