గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (17:02 IST)

హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో వినోదాత్మ‌కంగా తీశాం- కథ కంచికి మనం ఇంటికి ద‌ర్శ‌క నిర్మాత‌లు

Chanikya Chinna, Monish Pathipati
Chanikya Chinna, Monish Pathipati
అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈ చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసిన‌ప్ప‌డు చాలా కొత్త‌గా అనిపించింది. హార‌ర్ కామెడీ జాన‌ర్ లో ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కంతో మా చిత్ర బృందం భావిస్తున్నాము. ఈ సినిమాలో హీరో అదిత్ అరుణ్, పూజీత పొన్నాడ పేయిర్ ల‌వ్లీగా ఉండ‌నుంది. అలానే ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను మ‌ధ్య న‌డిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్. ఏప్రిల్ భారీ రేంజ్ లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.
 
ద‌ర్శ‌కుడు చాణ‌క్య చిన్న మ‌ట్లాడుతూ, క‌థ కంచికి మ‌నం ఇంటికి స్టోరీ ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగుతుంది. అదిత్ అరుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ క‌థ‌ హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మొత్తం సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.