సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (16:49 IST)

నేను నటించిన హీరోలందరితోనూ క్వారంటైన్‌లో ఉంటా : పూజా హెగ్డే

టాలీవుడ్‌లో తారాపథంలో దూసుకుపోతున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఈమె పట్టిందల్లా బంగారంగా మారిపోయింది. దీంతో ఆమె కోసం హీరోలతో పాటు దర్శక నిర్మాతలు సైతం క్యూకడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. ఇదేసమయంలో బాలీవుడ్‌లో సైతం ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. తాజాగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ల సరసన ఛాన్సులు కొట్టేసింది.  
 
అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా ఈమె ఇపుడు తన ఇంటికే పరిమితమైంది. అదేసమయంలో సోషల్ మీడియాలో నెటిజన్లతో చిట్ చాట్ చేస్తోంది. ఈ చాటింగ్‌లో భాగంగా, ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు సమాధానమిచ్చింది. లాక్డౌన్ సమయంలో హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే... మీరు నటించిన హీరోలలో ఎవరితో ఉంటారు? వారి నుంచి ఏం నేర్చుకుంటారు? అని ఓ నెటిజెన్ ప్రశ్నించాడు. 
 
దీనికి పూజా హెగ్డే తనదైనశైలిలో సమాధానమిచ్చింది. హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, హృతిక్ రోషన్‌లతో కలిసి నటించానని, అవకాశం వస్తే అందరు హీరోలను నిర్బంధంలోకి తీసుకుని వారి నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకుంటానని చెప్పింది.
 
ఒకవేళ, ఒక్క హీరోనే స్వీయ నిర్బంధంలోకి తీసుకోవాల్సి వస్తే... హృతిక్ రోషన్‌ను ఎంచుకుంటానని తెలిపింది. చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్ తన డ్రీమ్ హీరో అని చెప్పింది. బాలీవుడ్‌లో తన తొలి హీరో ఆయనేనని.... ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకుంటానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.