మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (17:01 IST)

మహేష్ బాబు ఫోటో షూట్‌లో తొక్కిసలాట..

గచ్చిబౌలి‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫోటో షూట్ జరిగింది. ఈ ఫోటో షూట్‌లో నెలకొన్న తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలైనాయి. ఏకే ఎంటర్టైన్మెంట్  ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. 
 
గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫోటో షూట్ జరిగింది. మహేష్ బాబుతో ఫోటో షూట్‌కు రావాలని ఆన్‌లైన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పోస్టు చేసింది. దీంతో మహేశ్ బాబుతో ఫోటో షూట్ కోసం భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. 
 
వేలాదిమంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బార్ గేట్స్ విరిగి పడడంతో కొంత మంది అభిమానులకు గాయాలైనాయి.

ఇద్దరు అభిమానులు కాళ్ళు విరగడంతో వారిని సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ వ్యవహారంపై లోకల్ పోలీసులకు కూడా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ ఘటనపై చందనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.