శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:18 IST)

అమ్మాయిలందరి మధ్యలో నేనుంటే- సుడిగాలి సుధీర్, ఆరు దాటితే ప్రతిరోజూ అదే పనేగా- హైపర్ ఆది

సుడిగాలి సుధీర్ చమక్కులు, హైపర్ ఆది పంచ్‌ల గురించి వేరే చెప్పక్కర్లేదు. డబుల్ మీనింగ్ లేకుండా ఒక్క పదం కూడా లేకుండా మాట్లాడలేడు హైపర్ ఆది అంటే అతిశయోక్తి కాదు. ఢీ షోకి సంబంధించి తాజా ప్రొమోలో సుడిగాలి సుధీర్ మాట్లాడిన ఒక్క మాటకు వరసబెట్టి పంచ్‌లు వేసాడు ఆది.
 
అమ్మాయిలందరి మధ్య నేనుంటే అని సుడిగాలి సుధీర్ అన్న డైలాగుకి.. సింహం కూడా అనుకున్నప్పుడే వేటాడుతూంది, కానీ మా అన్న ఆరు దాటితే ప్రతిరోజూ వేటాడుతాడు. అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, కానీ మా అన్న ఆరు దాటితో తలుపు తీసేవరకూ కొడుతూనే వుంటాడు.
 
ప్రతి ఒక్కరి జీవితంలో మలుపులు వుంటాయేమో, మా అన్న జీవితంలో అన్నీ తలుపులే. కానీ అన్న ఈ అడవీ నీదే ఈ వేటా నీదే అంటూ హైపర్ ఆది పంచ్ లు పేలుస్తుంటే ప్రియమణి, సంగీత, పూర్ణ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ వున్నారు. మరి పూర్తి ఎపిసోడ్ చూడాలంటే మాత్రం ఏప్రిల్ 14 వరకూ ఆగాల్సిందే.