శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (11:05 IST)

జబర్దస్త్ హైపర్ ఆదికి త్వరలో వివాహం.. అమ్మాయి ఎవరంటే..?

జబర్దస్త్ హైపర్ ఆదికి త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు బుల్లి తెరపై సక్సస్‌పుల్ కమెడియన్ కొనసాగుతున్న అది పలు షోలతో అబిమానులు అలరిస్తున్నాడు. ఈ టీవీలో ప్రసారమయే జబర్దస్త్ షోతో పాప్‌లారీటి సంపాదించిన ఈ హైపర్ కమెడియన్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడని సమాచారం. తన స్వంత జిల్లా ప్రకాశంకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సబంధమని అది సన్నిహితులు చెప్తున్నారు.
 
పెళ్ళి విషయంలో మొండి పట్టుదల తన డెసిషన్ మార్చుకున్నాడనే తెలుస్తోంది. జబర్ధస్త్ స్క్రిప్ట్ రైటర్ నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన హైపర్ ఆది అభిమానుల్లో తన కంటూ ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి హైపర్ ఆది అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే మరో ఎత్తు అనే చెప్పాలి. ఇప్పటికే ఈ షో ద్వారా యాంకర్ వర్షిణితో కలిసి లవర్ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు.
 
ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.. ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది. ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే న్యూస్ బయటికి కూడా వచ్చింది.