మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (15:07 IST)

వీడు మాములోడు కాదు.. 22ఏళ్లలో 12 మందిని పెళ్లాడాడు.. చివరికి?

చెన్నైకి చెందిన 12సార్లు పెళ్లి చేసుకున్నాడు. అంతా ఫేస్‌బుక్ సాయంతో 12 మందిని మాయ మాటలతో అమ్మాయిలను ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకుని... డబ్బులు గుంజేసేవాడు. వివరాల్లోకి వెళితే.. గణేశ్ (22) అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో చూడటానికి అందంగా ఉంటాడు.

లవ్లీ గణేశ్ పేరిట ఫేస్ బుక్‌లో ఖాతాను తెరిచి, తన మాయమాటలతో అమ్మాయిలను లవ్‌లో పడేసి, వారిని పెళ్లి చేసుకోవడమే ఇతని ప్రవృత్తి. ఒకరిని, ఇద్దరినీ కాదు. ఏకంగా 12 మందిని ఇలా పెళ్లాడాడు. 12వ భార్య ఇతని నిజ స్వరూపాన్ని కనుక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.
 
తాజాగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న గణేశ్, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఇద్దరూ మేజర్లే కావడంతో వారు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కొంతకాలం తరువాత గణేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి, తనకన్నా ముందు అతనికి 11 పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని షాక్‌కు గురైంది. 11 మందిని అతను మోసం చేశాడని, తాను 12వ దానినని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది. ఆపై విచారించిన పోలీసులు గణేశ్‌ను అరెస్ట్ చేసి, కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.