పెద్దలు నేర్పిన నీతి నిజాయితీకి కట్టుబడి ఎదిగానుః నట్టికుమార్
`చిన్న సినిమాలు బతకాలనే నేను మొదటి నుంచి కోరుకుంటున్నా. ఆ క్రమంలో నేను ఏం మాట్లాడినా పెద్దలు సీరియస్‌గా తీసుకోలేదు. స్పోర్టివ్‌గా తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దాము వంటి వారు నన్ను సోదరిడిలానే భావించారు. సినిమా సమస్యలపై నేను గట్టిగా మాట్లాడినా వ్యతిరేకంగా వారు చూడకపోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని` ప్రముఖ నట్టికుమార్ పేర్కొన్నారు.
తెలుగు సినిమారంగంలో ఆఫీస్‌బాయ్ నుంచి నిర్మాత స్థాయికి ఎదిగడానికి కారణమైన తెలుగు కళామతల్లకి కృతజ్ఞతలు తెలియజేస్తుశారు నట్టికుమార్. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సినిమారంగానికి వచ్చి 32 ఏల్ళు అయిన ఆయనకు ఈ ఏడాది యాభై సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో పలు విషయాలను పంచుకున్నారు.
ఈ ఏడాది ప్రత్యేకం
- ప్రతి ఏడాది పుట్టినరోజున ఏదో ప్రత్యేకత వుంటుంది. ఈ ఏడాది మాత్రం మరింత ప్రియమైనది. నాకుమారుడు హీరోగా `సైకోవర్మ` సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా నా కుమార్తె `దెయ్యంతో సహజీవనం`తో నాయికగా పరిచయం అవుతుంది. ఇక నేనుకూడా 2వేల సంవత్సరంలో దర్శకత్వం మానేశాను. మరలా ఇప్పుడు దర్శకత్వం చేస్తున్నాను. ఇవి నాకు ఈ ఏడాది ప్రత్యేకతలు.
- ప్రతి ఏడాది సినిమాలు నిర్మిస్తున్నాను. రామ్‌గోపాల్ వర్మతో కొన్ని సినిమాలు చేశా. ఎందుకంటే నేను సినిమానే నమ్ముకున్నా. వేరే వ్యాపారులున్నా సినిమా అంటేనే నాకూ నా పిల్లలకు ప్రాణం. రాజశేఖర్‌తో అర్జున సినిమా చేశాను. అది కూడా త్వరలో విడుదల కాబోతుంది.
పదిమంది బాగుండాలనే ఆశిస్తా
- సినిమా పరిశ్రమలో నాకు గురువులు డా. దాసరినారాయణరావుగారు, డా. డి. రామానాయుడుగారు. తమ్మారెడ్డి భరద్వాజగారు. వారి దగ్గరే నేను చిన్నప్పటినుంచి పెరిగాను. వారి పేరు ఎక్కడా చెడకొట్టకుండా నీతి నిజాయితీగా వుండమని చెప్పినట్లు నడిచాను. నేను ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. ఏ ఒక్కరూ లబ్దిపొందకూడదు. పదిమందీ సినిమారంగలో వుండాలనే నా భావన. మా గురువులు నేర్పింది కూడా అదే.
కాశ్మీర్ సమస్యపై ఐదు భాషల్లో సినిమా
- ఇక మా కుమార్తె నట్టి కరుణ కథానాయికగా కాశ్మీర్ సమస్యపై ఐదు భాషల్లో సినిమా చేయబోతున్నాను. ఆర్టికల్ 370పై వుండే కథ అది. ఆ కథలో మహిళకు వున్న హక్కులకోసం పోరాడే సినిమా. ఆ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నాను. అలాగే రాజశేఖర్‌గారితో ఓ సినిమా చేయబోతున్నా. ఇంకా మూడు సినిమాలు ప్లాన్‌లో వున్నాయి. ప్రతి ఏడాది ఎనిమిది సినిమాలు చేయాలనే ఆలోచనలో వున్నాను. మా కుమారుడు, కుమార్తెలు సీనియర్స్‌తో నటించేవిధంగా సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాను.
- ఫిలింఛాంబర్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నాను. 32 ఏళ్ళలో ఎంతోమంది నాకు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ ప్రసాద్‌గారు ఆర్థికంగా అండగా వున్నాను. నేను ఏరోజు మాట్లాడినా ఫిలింఛాంబర్‌ను అగౌరపర్చలేదు. చిన్న సినిమాలు బతకాలని 2000 నుంచి నేను కోరుకుంటున్నాను. అదే ఇప్పటికీ కోరుకుంటున్నా. నాలాగే ఎందరో కొత్తవారు సినిమాపై ప్రేమతో వస్తున్నారు. వారంతా పరిశ్రమలో బాగుపడాలని ఆశిస్తున్నానని తెలిపారు.