లావణ్యతో నాకు ఎఫైర్ వుందంటూ జూనియర్ ఆర్టిస్ట్, ఫిర్యాదు చేసిన నటి

Lavanya Tripathi
ఐవీఆర్| Last Modified మంగళవారం, 17 మార్చి 2020 (17:18 IST)
ట్రెండింగ్, పాపులర్ అయ్యేందుకు కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తుండటం మనం చూస్తున్నదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్టు తన నోటికొచ్చినట్లు వాగి పోలీసు స్టేషను చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.

అసలు విషయం ఏంటంటే... ఈమధ్య యూట్యూబ్‌లో సునిశిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ తను బాహుబలి సినిమాలో పాటలు పాడానని లావణ్య త్రిపాఠికి వివాహం జరిగిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా లావణ్యతో తనకు ఎఫైర్ ఉందని, తమన్నాతో కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కాస్తా లావణ్య త్రిపాఠి దృష్టికి వెళ్లడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పరిశీలించి చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.దీనిపై మరింత చదవండి :