గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (16:16 IST)

సుబ్బలక్ష్మీ, రేఖ బ‌యోపిక్ చేయాల‌నుందిః అదితిరావు హైద‌రి

MS, Reka, Adithirao
ప్ర‌స్తుతం హీరోయిన్ల‌కు బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి త‌ర్వాత మ‌రింత ఆస‌క్తి న‌టీన‌టుల‌లో నెల‌కొంది. క‌పిల్‌దేవ్‌, ధోనీ వంటివారి బ‌యోపిక్ లు వ‌స్తూనే వున్నాయి. అలాంటి బ‌యోపిక్‌ల‌లో అదితిరావు హైద‌రికి న‌టించాల‌నుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్ప‌ష్టంగా తెలియ‌జేస్తుంది.
 
బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. నాకు సంగీతం అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను. అలా ఎంఎస్ సుబ్బలక్ష్మీ గారి బయోపిక్ అయితే బాగుంటుంది. యాక్ట్రెస్ బయోపిక్ కూడా ఇష్టం. ఇప్పటికే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, స్పోర్ట్స్ పర్సన్ ఇలా ఏ బయోపిక్ అయిన నేను చేయగలను. రేఖ గారి బయోపిక్ చేయడం నాకు ఎంతో ఇష్టం. ఆమెను రేఖమ్మ అని పిలుస్తాను. న‌టిగా ఇలాంటి అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తాన‌ని పేర్కొంది.