బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (17:54 IST)

నేను దాన్ని ఆయనకు గురుదక్షిణగా భావించా : మోహన్ లాల్

Mohanlal
Mohanlal
జీలో 'మనోరథంగల్' మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. తొమ్మిది కథల్లో, తొమ్మిది మంది సూపర్‌ స్టార్లు నటించారు. వాటిని ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు కలిసి తెరకెక్కించారు.
 
మలయాళ చిత్రసీమలో ఒక కొత్త శకానికి గుర్తుగా నిలిచే సంచలనాత్మక సిరీస్ ‘మనోర‌థంగల్’ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సాహితీవేత్త మదత్ తెక్కెపట్టు వాసుదేవన్ నాయర్ 90 సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. M.T. వాసు దేవన్ నాయర్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ నటులు, నిర్మాత.

ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్, M.T. వాసుదేవ‌న్ నాయ‌ర్‌ కుమార్తె అశ్వతి V నాయర్ అతిథులుగా విచ్చేశారు. మనోరథంగల్ ఎపిసోడ్‌లలో ఒకదానికి వాసుదేవన్ నాయర్ కుమార్తె అశ్వతి దర్శకత్వం వహించారు. మనోర‌థంగల్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వాసుదేవన్ నాయర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
 
కేరళలోని సుందరమైన నేపథ్యానికి వ్యతిరేకంగా మానవ స్వభావాలు, మనుషుల్లో ఉండే సంక్లిష్టతలను ఆధారంగా ‘మనోరథంగల్’ను రచించారు. ఒక్కో వైవిధ్యమైన క‌థాంశాలుగా తొమ్మిది కథలతో సాగే సమాహారామే మనోరథంగల్. ఇది మానవ ప్రవర్తనలొని వైరుధ్యాలను చూపిస్తుంది. కరుణ, ప్రవృత్తులు రెండింటినీ చూపిస్తుంది.మనిషికి ఉండే భావోద్వేగాలు, మానవత్వం యొక్క గొప్పదనం చెప్పేలా ఈ సిరీస్ సాగనుంది.
 
ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది గ్రిప్పింగ్ కథలు ఉన్నాయి. ప్రతీ కథ పద్మవిభూషణ్ డాక్టర్ కమల్ హాసన్ పరిచయం చేస్తారు. ‘ఒల్లవుం తీరవుమ్’ (అలలు, నది ఒడ్డు)తో ఈ వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రముఖ మోహన్‌లాల్ నటించారు. ఈ ఎపిసోడ్‌కు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. రంజిత్ దర్శకత్వంలో ‘కడుగన్నవా ఒరు యాత్ర కురిప్పు’ (కడుగన్నవ: ఎ ట్రావెల్ నోట్)లో మమ్ముట్టి నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ‘శిలాలిఖితం’ ఎపిసోడ్‌లో బిజు మీనన్, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ నటించారు. ‘కచ్చ’ (విజన్)లో పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్ నటించారు. దీనికి శ్యామప్రసాద్ దర్శకత్వం వహించారు. అశ్వతీ నాయర్ దర్శకత్వంలోని 'విల్పన' (ది సేల్)లో మధుబాల, ఆసిఫ్ అలీలు నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ‘షెర్లాక్’లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఫహద్ ఫాసిల్, నదియా మొయిదు నటించారు. జయరాజన్ నాయర్ తెరకెక్కించిన ‘స్వర్గం తురకున్న సమయం’ (స్వర్గం తలుపులు తెరిచినప్పుడు) కైలాష్, ఇంద్రన్స్, నేదురుముడి వేణు, ఎంజి పనికర్, సురభి లక్ష్మితో సహా నక్షత్ర నటించారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో  'అభ్యం తీరి వీందుం' (మరోసారి, శరణు వెతుకులాట) ఉండే ఈ ఎపిసోడ్‌లో సిద్ధిక్, ఇషిత్ యామిని, నజీర్ నటించిచారు. రతీష్ అంబట్ దర్శకత్వంలో ‘కడల్‌క్కట్టు’ (సీ బ్రీజ్) వచ్చిన ఈ ఎపిసోడ్‌లో ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి నటించారు.
 
మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ‘ఎం.టి. సార్ రాసిన ఈ కథ కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను దాన్ని ఆయనకు గురుదక్షిణగా భావించాను. మనోరథంగల్ ఆగస్టు 15నుంచి  ZEE5లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తొమ్మిది కథలున్నాయి. భారతీయ సినిమా నుండి ప్రఖ్యాత దర్శకులు, నటులు మరియు సాంకేతిక నిపుణులందరూ కలిసి ఈ వెబ్ సిరీస్‌ కోసం పని చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులకు అందించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.
 
ZEE5 లో విడుదలైనప్పటి నుంచి మనోరథంగల్ పరిశ్రమ అంతటా, ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభిమానాన్ని, ప్రశంసలను దక్కించుకుంటోంది.