బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (08:12 IST)

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

Thaman
Thaman
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమాలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత మరో ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారనీ, దేవీశ్రీప్రసాద్ కు పోటీగా వుందని వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై నిన్న ప్రత్యేకంగా థమన్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2లో పనిచేయడం అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అదీ కూడా అల్లు అర్జున్ కోసమే అని చెప్పారు. హిందీలో తరచుగా ఇలాంటి ప్రయత్నాలు  చూస్తుంటాం. కానీ అది ఆరోగ్యకరమం కాదు. 
 
నేను పుష్ప2 ప్రథమార్థంలో వచ్చే మూడు రీల్స్ కు సంగీతం అందించా. పుష్ప2 సినిమా చూశాను. మరో లెవల్ లో వుంది. అల్లు అర్జున్ కు అవార్డులన్నీ వెతుక్కుంటూ వస్తాయి అన్నారు. అలాగే ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాను, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకూ సంగీతం సమకూరుస్తున్నాను. రాజాసాబ్ లో రీమిక్స్ సాంగ్ వుంటుంది. అది అద్భుతంగా వుంటుంది. ఇక ఓజీ సినిమా గురించి చెప్పాలంటే, కత ప్రకారం జపాన్ కొరియన్ నేపథ్యం వుంటుంది. అందుకే కొరియన్ మ్యూజిక్ బ్రుందంతో పనిచేస్తున్నా అన్నారు.