గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (10:29 IST)

నాకు ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని వుంది: కాజల్ అగర్వాల్

ప్రభాస్ పెళ్లి. ఇటీవలే అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు చేసుకున్నాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. దాంతో ప్రతి ఒక్కరు ప్రభాస్ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి గురించి జరుగుతున్న చర్చ అంతాఇంతా కాదు. బాహుబలి నటించిన తర్వాత అనుష్క-ప్రభాస్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఐతే అవన్నీ గాలి కబుర్లు అని ఇద్దరూ కొట్టి పారేశారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలని వుంది అంటూ చెప్పి కాజల్ అగర్వాల్ షాకిచ్చింది. మంచు లక్ష్మి ఓ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి సినీ తారలను ఆహ్వానించి వారిని ఆసక్తికర ప్రశ్నలు వేసి ఇరుకున పెడుతోంది. ఇందులో భాగాంగా మంచుకి కాజల్ అగర్వాల్ కూడా చిక్కింది.
 
చెర్రీ, తారక్, ప్రభాస్ ఈ ముగ్గురులో ఎవర్ని చంపుతావు, ఎవరితో రిలేషన్ సాగిస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే, చెర్రీని చంపేస్తాననీ, తారక్ తో రిలేషన్ పెట్టుకుని ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఇక ప్రభాస్ పెళ్లంటే అనుష్కను వదిలేసి కాజల్ అగర్వాల్ గురించి మాట్లాడుకుంటారేమో?