మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (18:17 IST)

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జాన్ ఫస్టులుక్‌..

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం తరువాత, ప్రభాస్ తాజా చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాకి పూజా హెగ్డే కథానాయిక, ఇప్పటికే కొంతవరకు చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్‌‌‌ను హైదరాబాదులో షూటింగ్‌‌ను ప్లాన్ చేశారు. భారీ యాక్షన్ సీన్స్‌‌ను అక్కడ చిత్రీకరించనున్నట్లు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ అక్కడి నుంచి తిరిగి రాగానే ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అయితే 'జాన్' అనే టైటిల్‌‌‌ను ఖాయం చేస్తారా? మరో టైటిల్‌‌ను పెడతారా? అనేది ఈ నెల 23వ తేదీన తేలనుంది.

ఎందుకంటే ఆ రోజున ప్రభాస్ పుట్టినరోజు కనుక, ఆరోజే ఈ సినిమా ఫస్టులుక్‌‌‌ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.