శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:18 IST)

#HappyBirthdayPoojaHegde జిగేల్ రాణికి వెల్లువెత్తుతున్న విషెస్..

#HappyBirthdayPoojaHegde అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జిగేల్ రాణికి ఆదివారం (అక్టోబర్ 13వ తేదీ) పుట్టిన రోజు కావడంతో ఆమెకు సీనీ ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెలెబ్రిటీలు కూడా పూజా హెగ్డేకు విషెస్ చెప్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం బన్నీ సినిమా అల వైకుంఠపురంలో నటిస్తోంది. 
 
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రాణిస్తూ వరుస సినిమాలు చేస్తూ.. అగ్రహీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపులు సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రం ద్వారా పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ పడింది. 
 
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభించిన పూజా బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన 'మొహెంజదారో' సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కర్నాటకలోని మంగళూరులో జన్మించిన పూజ ముంబైలో పెరిగింది. పూజా 2012లో తొలిసారిగా తమిళ సినిమా ముగైమూడిలో నటించింది.
 
కాలేజీ రోజుల్లో పూజా తన తల్లి నిర్వహిస్తున్న నెట్‌వర్కింగ్ బిజినెస్‌కు సాయం చేసేది. తర్వాత మోడలింగ్‌ చేసేది. ఈ క్రమంలో 2009లో మిస్ ఇండియా టాలెంటెడ్, 2010లో మిస్ ఇండియా సౌత్ కిరీటాలను దక్కించుకుంది. కామర్స్‌లో పట్టా తీసుకున్న పూజా హెగ్డే ఐదు భాషల్లో మాట్లాడే నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది. 
 
తాను క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, టెన్నీస్‌స్టార్ రోజర్ ఫెదరర్‌కు పెద్ద ఫ్యాన్‌ను అని పూజా హెగ్డే చెబుతుంటుంది. ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'అల వైకుంఠపురములో' ఆమె నటిస్తోంది. పూజ పుట్టినరోజు సందర్భంగా 'అల వైకుంఠపురములో' చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.
 
ఇకపోతే.. ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేశ్ తదితర చిత్రాలలో కథానాయకిగా నటించిన సంగతి తెలిసిందే.