వారిద్దరి అక్రమ సంబంధాన్ని బయటపెట్టడంతో నన్ను చంపేందుకు కుట్ర : నటి పూజిత
ఐఏఎస్ అధికారిణి రేఖారాణికి, తన భర్త విజయగోపాల్‌కు మధ్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేయడంతో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని సీనియర్ నటి పూజిత ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా తనకు విడాకులివ్వకుండా తన భర్త ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు తన ఐడీప్రూఫ్, తమ వివాహాన్ని తెలిపే సాక్ష్యాలు పోలీసులకు సమర్పించింది.
తన బిడ్డకు న్యాయం జరిగేందుకే తాను పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. దీంతో తనను హత్య చేసేందుకు వారిద్దరు కుట్ర పన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.