సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 11 మార్చి 2019 (21:52 IST)

నటి హేమకు ఆ పవర్ వుంది... పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇస్తేనా?

నటి హేమ అంటేనే ఓ పవర్‌ఫుల్ వుమెన్. ఎందుకంటే ఆమె ఏది మాట్లాడినా ముఖం మీదే మాట్లాడేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హేమపై పెద్ద చర్చే జరుగుతుంది. కారణం... ఆమె మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవడమే. ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నటి హేమ అనూహ్యంగా విజయం సాధించారు. దీనితో అంతా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హేమ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా ఎన్నికల్లో విజయం సాధించిన హేమకు పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇస్తే... ఢంకా బజాయించి గెలిచి తీరుతారని అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున హేమకు టిక్కెట్ ఇస్తారా... అందుకు హేమ అంగీకరిస్తారా... లెటజ్ వెయిట్ అండ్ సీ.