ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (16:07 IST)

బీచ్‌లో సేద తీరుతున్న ఇలియానా.. ఫోటోలు వైరల్

అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రంతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన గోవా సుందరి ఇలియానా పలకరిస్తోంది. ఈ భామ ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇలియానా తనకిష్టమైన అండమాన్‌ దీవుల్లోని అందమైన లొకేషన్‌లో గల ముంజో ఓసియన్‌ రిసార్ట్‌లో సేద తీరింది.

సముద్రం మిమ్మల్ని పిలుస్తున్నపుడు అంటూ క్యాప్షన్‌ ఇస్తూ.. బీచ్‌‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ మధ్య కాలంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు తిరిగి కెరీర్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన నాజూకు తనానికి మెరుగులు దిద్దుతోంది ఇలియానా. ఇటీవలే ఇలియానా నటించిన హిందీ సినిమా ‘పాగల్‌పంతీ' విడుదలయింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇలియానా నటనకు మంచి మార్కులే పడ్డాయి.