ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (14:21 IST)

ఫైటర్‌తో బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న అనన్యపాండే

Vijay devarakonda
విజయ్‌దేవరకొండ హీరోగా, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా అనన్యపాండే నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతుంది. 
 
చిత్రీకరణలో భాగంగా తాజాగా విజయ్‌-అనన్యలపై రాత్రి సమయంలో ముంబయి రోడ్లపై బైక్‌రైడ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీకవడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 
 
విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియన్‌ సినిమాగా 'ఫైటర్‌' తెరకెక్కుతోంది. యాక్షన్‌ ప్రధానాంశంగా ఓ ప్రేమ కథతో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని వచ్చారు. ఈ సినిమాకి ఛార్మి, కరణ్‌జోహర్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.