'ఇమైక్క నొడికల్'లో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార..
నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ సినిమాలో నయనతార నటిస్తోంది. ఐదారేళ్ల క్రితం వరకు తల్లి పాత్రలో నటించేందుకు హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. కానీ, ఇ
నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ సినిమాలో నయనతార నటిస్తోంది. ఐదారేళ్ల క్రితం వరకు తల్లి పాత్రలో నటించేందుకు హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడు అగ్రతారలు సైతం వెండితెరపై అమ్మగా కనిపించేందుకు ముందుకొస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయన నటిస్తోంది.
థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తుండడం విశేషం. టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, నయనతార ఇదివరకే "మాయ" చిత్రంలో ఒక బిడ్డకు తల్లిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.