బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:06 IST)

పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఇందువదన

Varun Sandesh, Farnaz Shetty, MNR, Madhavi Aadurthi and ohters
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా MSR దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం "ఇందువదన". చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తో జనవరి 1 ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  "ఇందువదన" చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాధవి ఆదుర్తి మాట్లాడుతూ..మాకు ఈ స్టోరీ ను సతీష్ గారు చాలా బాగా నెరేట్ చేయడంతో ఈ కథ మా అందరికీ బాగా నచ్చడంతో ఈ సినిమాను ఎంతో  ప్యాషనేట్ తో  మేమంతా కలసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పిరియాడికల్  బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్, హర్రర్ ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఏంటర్ టైన్మెంట్స్ చేస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూసే చూసే సినిమా ఇది. ఈ మూవీ రిలీజ్ తర్వాత  ఆడియన్స్ కూడా మా సినిమాను మంచి బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను . హీరో హీరోయిన్లు కూడా చాలా బాగా నటించారు. ఇందులో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, సింగర్స్, తదితర టెక్నిసిషన్స్ , నటీనటులు అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తో జనవరి 1 ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 
 
సహా నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ, పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అందరి సపోర్ట్ తో చాలా బాగా వచ్చింది.ఇందులో ఫర్నాజ్ శెట్టి అద్బుతంగా నటించింది.
జనవరి 1 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 
 
దర్శకుడు యమ్.యస్ ఆర్ మాట్లాడుతూ..మాధవి ఆదుర్తి గారి సపోర్ట్ నాకు 100% ఉంది. ఇందులో కామెడీఎమోషన్ ఇలా అన్ని ఫుల్ మీల్స్ ఉంటుంది.ర్ చిత్ర నిర్మాతలు బాగా సపోర్ట్ తో ఈ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు భాస్కర పట్ల ఒక మంచి సాంగ్ రాశారు.హీరో, హీరోయిన్లు, ఆర్టిస్టులు అంఫరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.హీరో వరుణ్ చాలా బాగా నటించాడు. ఫర్నాజ్ శెట్టి ఒక తెలుగు అమ్మాయి గా అద్భుతంగా చేసింది.. ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయి. టెక్నిసిషన్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. నాకున్న తక్కువ టైం లో మారేడ్ పల్లి, రంప చోడవరం వంటి చాలా లొకేషన్స్ లలో ఈ సినిమా చేయడం జరిగింది. జనవరి 1 న విడుదల అవుతున్న మా సినిమా  లస్ట్ మూవీ  కాదు ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమా అని అన్నారు 
 
హీరో వరుణ్ మాట్లాడుతూ, నేను బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది.ఇప్పటివరకు పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయలేదు.ఇందులో నా లుక్ డీఫ్రెంట్ గా డిజైన్ చేశారు దర్శకుడు. నరేష్,సంతోష్,గిరిధర్ లు మమ్మల్ని నమ్మి ఈ సినిమా తీయడం జరిగింది.మహేష్ విట్టా, పార్వతీశం లు చాలా బాగా చేశారు.టెక్నిసిషన్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత అవుట్ ఫుట్ వచ్చింది. ఇందులో  చిలిపి చూపులు సాంగ్ కు శివ శంకర్ మాస్టర్ తో పని చేయడం హ్యాపీ గా ఉన్నా.. తను మన మద్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ సినిమాకు ఓటిటి  ఆఫర్ వచ్చినా కూడా ఐదు సంవత్సరాలు తర్వాత నేను బిగ్ స్క్రీన్ పై వస్తున్నానని నా కోసం థియేటర్స్ లలో విడుదల చేస్తున్నందుకు చిత్ర నిర్మాతలకు నా ధన్యవాదాలు..జనవరి 1 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని కోరుతున్నాను.
 
రైటర్ సతీష్  మాట్లాడుతూ .. ఇది నా ఫస్ట్ మూవీ కొత్త కథ ఇంతవరకు రాలేదు ఈ కథ వినగానే డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని హీరో గాని ఒక సిట్టింగ్లో ఓకే చేశారు.మంచి కథతో వస్తున్న ఈ సినిమా జనవరి 1 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు