మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (20:21 IST)

గల్ఫ్ రీజియన్‌లో 10 బిలియన్ యూఎస్ డాలర్ల ప్రాజెక్టు

గల్ఫ్ రీజయన్లో సినిమా పరిశ్రమకు 10 బిలియన్ యూఎస్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఇండీవుడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోహన్ రాయ్ వెల్లడించారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ ఈ నెల 1 నుంచి 4 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వివి

గల్ఫ్ రీజయన్లో సినిమా పరిశ్రమకు 10 బిలియన్ యూఎస్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఇండీవుడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోహన్ రాయ్ వెల్లడించారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ ఈ నెల 1 నుంచి 4 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి బిలియనీర్లు హాజరయ్యారు. వీరంతా ఇండీవుడ్‌లో 10 బిలియన్ యూఎస్ డాలర్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. 
 
గల్ఫ్ రీజియన్లోని వినోద పరిశ్రమకు ప్రజల్లో వున్న ఆదరణను గుర్తించిన మీదట తాము ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తాము సంస్థ కార్యకాలపాలను విస్తరించనున్నట్లు తెలిపారు.