శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:23 IST)

దిలీప్ భార్యకు సీమంతం..

నటి కిడ్నాప్ కేసులో బెయిల్‌పై విడుదలైన మలయాళ నటుడు దిలీప్ రెండో భార్యకు సీమంతం వేడుక ఇటీవల జరిగింది. తమిళంలో కాశీ, ఎన్‌మన వానిల్ వంటి సినిమాల్లో నటించిన కావ్యామాధవన్‌ను దిలీప్ రెండో పెళ్లి చేసుకున్న స

నటి కిడ్నాప్ కేసులో బెయిల్‌పై విడుదలైన మలయాళ నటుడు దిలీప్ రెండో భార్యకు సీమంతం వేడుక ఇటీవల జరిగింది. తమిళంలో కాశీ, ఎన్‌మన వానిల్ వంటి సినిమాల్లో నటించిన కావ్యామాధవన్‌ను దిలీప్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అగ్రనటిగానూ మంచి మార్కులేసుకున్న కావ్య మాధవన్.. గర్భం ధరించింది. ఈమెకు సీమంతం ఇటీవల జరిగింది. 
 
అంతకుముందు కావ్యామాధవన్ నిశాల్ చంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత నిషాల్ చంద్రకు విడాకులిచ్చిన కావ్యా మాధవన్..దిలీప్‌తో ప్రేమలో పడి ఆయన్నే వివాహం చేసుకున్నారు. దిలీప్ కూడా తన తొలి భార్య మంజువారియర్‌కు విడాకులిచ్చి కావ్యా మాధవన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి భావన కేసులో జైలు కెళ్లాడు. 
 
ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా వున్న కావ్యామాధవన్... ఇటీవల గర్భం దాల్చిందని.. ఆమెకు సీమంతం కూడా జరిగింది. స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో దిలీప్ తొలి భార్య కుమార్తె మీనాక్షి కూడా హాజరు కావడం విశేషం. పసుపు రంగు గౌన్‌లో కావ్యామాధవన్ సీమంతం ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.