సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:03 IST)

వంద ఎపిసోడ్లుగా నిహారిక మ్యాడ్ హౌస్ (వీడియో)

మెగా డాటర్ నిహారిక సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలు ఆమెకు హిట్‌ ఇవ్వలేకపోయాయి. దీంతో నిహారిక సినిమాలను పక్కనబెట్టి.. మళ్లీ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. తాజాగా నిహారిక తన ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై మ్యాడ్ హౌస్ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది. 
 
ఈ వెబ్ సిరీస్‌ను వంద ఎపిసోడ్లుగా నిహారిక మ్యాడ్ హౌస్ (వీడియో) మహేష్ ఉప్పల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ వంద ఎపిసోడ్లుగా రానుంది. ఇకపోతే.. ప్రస్తుతం పెదనాన్న చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరిసింహారెడ్డి’లో బోయపిల్ల పాత్రలో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇంకేముంది.. నిహారిక వెబ్ సిరీస్ లుక్ ఎలా వుందో ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.