శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (14:36 IST)

నీహారికతో సాయిధరమ్ తేజ్ వివాహం? సోషల్ మీడియాలో మెగా పెళ్లి వార్త వైరల్!

సోషల్ మీడియాలో ఓ మెగా పెళ్లి వార్త వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నీహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారు. ద

సోషల్ మీడియాలో ఓ మెగా పెళ్లి వార్త వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నీహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పెళ్లి వార్తపై ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
 
చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడు సాయి ధరమ్‌ తేజ్‌. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక. వీరిద్దరు వీరిద్దరు వరుసకు బాబామరదళ్లు కూడా. వీరిద్దరు పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 
 
కాగా నిహారిక, సాయి ధరమ్‌ తేజ్‌ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే సాన్నిహిత్యం అనేది ఉంటుందని, పెళ్లివార్త ఊకార్లే అని కొందరు వాదిస్తుండగా, మరోవైపు ’మెగా’ ఫ్యాన్స్‌ మాత్రం కన్‌ఫ్యూజింగ్‌‌లో ఉన్నారు. అయితే దీనిపై మెగాస్టార్‌ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే తప్ప, అసలు విషయం ఏంటనేది తెలియదు.