శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (13:54 IST)

జగన్ ఓ యోధుడు... విజయగర్వం లేదు.. పూరీ జగన్నాథ్

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కళ్ళలో రవ్వంత కూడా విజయగర్వం కనిపించలేదని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. అదేసయమంలో ఆయన కళ్ళలో ఒంటరిగా ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయని చెప్పుకొచ్చారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పూరీ జగన్నాథ్ స్పందిస్తూ, సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో విజయగర్వం మచ్చుకైనా కనిపించలేదన్నారు. పైగా, ఆయన ముఖంలో గెలుచుకున్న సీఎం పదవి కుంటే ఆయనకు పొడిచిన వెన్నుపోట్లే కనిపించాయన్నారు. ఆయన తన పడక గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చినపుడు వచ్చిన కన్నీళ్లు కనిపించాయన్నారు. వైఎస్ఆర్ ఇంటి ఆడపడుచుల ఆవేదనలు కనిపించాయన్నారు. ఏది ఏమైనా రాజన్న బిడ్డ అనిపించాడని పూరీ జగన్నాథ్ అన్నారు. 
 
జగన్ చూస్తుంటే నిజంగా ఆయన ఓ యోధుడు. ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం కారణంగానే ఈ విజయం వచ్చిందని జగన్ చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. నిజానికి దైవనిర్ణయం కంటే ప్రజా నిర్ణయం గొప్పదన్నారు. ఈ కాలపు ప్రజలను మనుషులను మార్చడంలో దేవుళ్లు ఎపుడో విఫలమయ్యారు. కానీ, దేవుళ్లను ప్రజలు మార్చగలరు. ఇన్ని కోట్ల మంది ప్రజలు చేతులెత్తి ఎవరికి మొక్కితే వారే దేవుళ్లు. ఇపుడు నవ్యాంధ్రలోని ప్రజలంతా కలిసి జగన్‌కు చేతులెత్తి మొక్కారని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.