శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (19:28 IST)

శిఖర్ పహారియాతో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)

Janhvi Kapoor
Janhvi Kapoor
బాలీవుడ్ బేబీ జాన్వీ కపూర్ దేవర నుండి కొత్తగా విడుదల చేసిన చుట్టమల్లె పాటలో తన గ్లామర్‌ డోస్ పెంచేసింది. ఈ పాటలో ఆమె తిరుగులేని గ్లామర్ విందు నిచ్చింది. జాన్వీ కపూర్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది. 
 
జాన్వీ తన చిరకాల ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు వచ్చింది. వారు కలిసి తిరుమలను సందర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వారు సాధారణంగా కలిసి కెమెరాకు పోజులివ్వడానికి ఇష్టపడరు. అయితే ఈసారి సీన్ మారింది. 
 
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన జాన్వీ, పహారియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి నడవడం.. వారు మాట్లాడే తరుణంలో కెమెరాలు వారిని జంటగా ఫోటోలు తీసుకున్నాయి. 
Janhvi Kapoor
Janhvi Kapoor
 
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్న జాన్వీ.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.