సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (14:29 IST)

కుమారుడు హరికి వివాహం జరిపించిన జయమాలిని

Jayamalini
Jayamalini
ఎన్నో ఏళ్ళుగా వెండితెరపై కనిపించకుండా పోయినా జయమాలిని సినీ అభిమానులు ఆమెను మర్చిపోలేదు. కుటుంబ పోషణ కోసం చిన్న వయస్సులోనే డాన్సర్‌గా  80, 90 దశకంలో డాన్సర్‌. అప్పట్లో ప్రతి సినిమాలో క్లబ్‌ డాన్సర్లుగా జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మిత, జయమాలిని వుండేవారు. ఓ దశలో పోలీసు అధికారి పార్తీపన్‌ను పెండ్లి చేసుకుంది. ఆమెకు ఓ కుమార్తె, కుమారుడు. కుమార్తెను సినీరంగ ఛాయలకు రానివ్వని తేల్చిచెప్పింది.
 
hari, priyanka
hari, priyanka
ఇక కుమారుడు హరి స్పెయిన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. చెన్నైకు చెందిన ఎం.బి.ఎ. చేసిన ప్రియాంకతో వివాహం ఈనెల 23న రిగింది. మదరాసులోని విపిజీ గోల్డెన్‌ బీచ్‌ రిసార్ట్స్‌లో కుటుంబసభ్యులు, సినీరంగ ప్రముఖుల సమక్షంలో వివాహం జరిగింది. ఈ వివాహాన ఆహ్వాన పత్రాన్ని జయమాలిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే పెండ్లి ఫొటోలను ఆ తర్వాత కూడా ఆమె పోస్ట్‌ చేయలేదు.