జాన్వీ కపూర్ కొత్త లుక్ అదిరింది..

తాజాగా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ఎయిర్ పోర్టులో జాన్వి లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో జాన్వి న్యూ లుక్ ప్రస్తుతం శ్రీదేవి ఫ్యాన్సుకు పిచ్చ పిచ్చగా నచ్

selvi| Last Updated: గురువారం, 30 ఆగస్టు 2018 (11:01 IST)
తాజాగా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ఎయిర్ పోర్టులో జాన్వి లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో జాన్వి న్యూ లుక్ ప్రస్తుతం శ్రీదేవి ఫ్యాన్సుకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. మరోవైపు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ప్రస్తుతం అమ్మ బాటలోనే నడుస్తోంది. తల్లి ధరించిన దుస్తులనే ధరిస్తోంది. 
 
శ్రీదేవికి అవార్డ్ వచ్చిన సమయంలో కూడా తల్లి శారీనే కట్టుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి హఠాన్మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆమె కుటుంబ సభ్యులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.
 
ముఖ్యంగా శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లు అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆమె జ్ఞాపకాల్లో నుంచి జాన్వి ఇంకా బయటపడలేదని సమాచారం. తన తల్లి దుస్తుల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ.. తల్లి సింప్లిసిటీనే ఫాలో అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.దీనిపై మరింత చదవండి :