సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 జులై 2024 (15:27 IST)

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

Johnny Master, Ramcharan,  upsana konidala
Johnny Master, Ramcharan, upsana konidala
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అని రాంచరణ్, ఉపాసన ను కలిసిన సంధర్భంగా కొరియో గ్రాఫర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ అన్నారు. నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు. నా పుట్టినరోజు సందర్భంగా చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా అని జానీ మాస్టర్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంటికి  వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి  ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది తెలిపారు. 
 
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.
 
మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని జానీ తెలిపారు. 
 
ఇదిలాఉండగా, గత కొద్దీ రోజులుగా సురేష్ అనే డాన్సర్ చేసిన డాన్సర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ జానీ మాస్టర్ ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలకు చెక్ పెట్టినట్లయింది.