గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (15:27 IST)

ఆ హీరోతో ఆగిపోయిన టైటిల్ కళ్యాణ్ రామ్ కు పెడుతున్నారా?

NKR 21 poster
NKR 21 poster
సినిమాల టైటిల్ విషయంలో హీరోలకు పెద్ద సవాల్ గా మారడం మామూలే. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు ఫ్యాన్స్ నుంచి కొన్ని టైటిల్స్ సూచాయిగా వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ సినిమా టైటిల్ కళ్యాణ్ రామ్ సినిమాకు పెడుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కళ్యాణ్ రామ్ 21 వ సినిమా గురించి ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్త ప్రకటించింది. విజయశాంతి కీలక పోలీస్ ఆఫీసర్ నటిస్తున్నట్లు తెలిపింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇదిలా వుండగా, ఇప్పుడు ఆ సినిమాకు గతంలో రామ్ చరణ్ తో సినిమాను ధరణి అనే దర్శకుడు చేస్తున్నట్లు ప్రకటించి మెరుపు అనే టైటిల్ ప్రకటించారు. కానీ ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకు కరెక్ట్ గా మెరుపు సరిపోతుందనీ త్వరలో టైటిల్ ప్రకటిస్తారని తెలియవచ్చింది. గతంలో ప్రభుదేవా సినిమా డబ్బింగ్ సినిమాకు మెరుపుతో వచ్చింది.