బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:56 IST)

జెన్యూన్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా జోరుగా హుషారుగా : శ్రీ‌విష్ణు

Vishnu- Viraj Ashwin
Vishnu- Viraj Ashwin
బేబి చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హౄద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్స్్ట ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి శ‌నివారం ఓ ల‌వ్‌మెలోడీ లిరిక‌ల్ వీడియోను హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు.

ఓ క‌ల‌లా...నువ్వ‌లా.. నిజమ‌య్యావే నువ్వు బంగారు బొమ్మ యువ‌రాణి యువ‌రాణి అంటూ కొన‌సాగే ఈ పాట‌ను స‌ర‌స్వ‌తి పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ర‌ఘు మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో విరాజ్ అశ్విన్‌, పూజిత‌ల‌పై చిత్రీక‌రించారు. 
 
ఆర్మ‌న్ మాలిక్‌, న‌వ్య‌స‌మీర ఈ పాట‌ను ఆల‌పించారు.  ఈ సంద‌ర్భంగా శ్రీ‌విష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం  సాంగ్ చూస్తుంటే ఇదొక జెన్యూన్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అనిపిస్తుంది. సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 
 
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ సాంగ్ చాలా క్యాచీగా వుంది. కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌తో ఓ ల‌వ్ఎంట‌ర్‌టైన‌ర్‌లా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం నా కెరీర్‌కు మ‌రో మంచి స‌క్సెస్‌ఫుల్ చిత్ర‌మ‌వుతుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త‌రం న‌చ్చే అంశాల‌తో అన్ని ఎమోష‌న్స్‌తో రూపొందుత‌న్న ఈ చిత్రం కొత్త‌ద‌నం ఆశించే అంద‌రికి న‌చ్చుతుంది. 
 
త్వ‌ర‌లోనే చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అని తెలిపారు. కొత్త‌ద‌నంతో నిండిన చిత్రాల‌కు విడుద‌ల విష‌యంలో నా స‌పోర్ట్ ఎల్ల‌ప్పూడు వుంటుంద‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్‌, కెమెరామెన్ మ‌హిరెడ్డి పందుగుల త‌దిత‌రులు పాల్గోన్నారు. విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్‌, ఎడిట‌ర్‌: మ‌ర్తండ్‌కెవెంక‌టేష్‌