శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (15:33 IST)

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్.. 70రోజులు, 12మంది సెలెబ్రిటీలు.. 60 కెమెరాలు

తమిళంలో సినీ లెజెండ్ కమల్ హాసన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని కారణాల ద్వారా ఈ షోపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ఈ షో సక్సెస్‌పుల్‌గా విజయ్ టీవీలో ప్రసారం

తమిళంలో సినీ లెజెండ్ కమల్ హాసన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని కారణాల ద్వారా ఈ షోపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ఈ షో సక్సెస్‌పుల్‌గా విజయ్ టీవీలో ప్రసారం అవుతోంది. ఇదే తరహాలో తెలుగులో కమల్ హాసన్ ప్లేసులో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై కనిపించనున్నారు. 
 
నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ షో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరోను టీవీలో చూసే సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. 70 రోజుల పాటు వరుసగా జరిగే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో జూలై 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ వారాంతం శని, ఆదివారాల్లో ఈ షోలో కనిపిస్తారు. ఈ షో 70 రోజులు, 12 మంది సెలెబ్రిటీలు, 60 కెమెరాల నీడలో జరుగనున్నాయి.  ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుంది.