మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (11:50 IST)

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ రిపీట్?

గతంలో జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జనతా గ్యారేజ్". ఈ చిత్రం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు ఈ కాంబినేషన్‌ మరోమారు రిపీట్ కానుందనే వార్తలు ఫిల్మ్ నగర్‌ల

గతంలో జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జనతా గ్యారేజ్". ఈ చిత్రం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు ఈ కాంబినేషన్‌ మరోమారు రిపీట్ కానుందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోది. త్రివిక్రమ్ డైలాగ్స్‌కు ఎన్టీఆర్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది.
 
ఇదిలావుంటే, కొరటాల శివ.. ఎన్టీఆర్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కొరటాల.. ఎన్టీఆర్‌ను కలిసి ఒక లైన్ చెప్పారట. ఎన్టీఆర్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. 
 
అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందుగా చిరంజీవితో కొరటాల ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబరు నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలై .. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్న సంకల్పంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్.. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 
 
ప్రిన్స్ మహేశ్ బాబు, కొరటాల కాంబోలో వచ్చిన రెండో సినిమా 'భరత అనే నేను' బాక్సాఫీస్ వద్ద ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం.