ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:09 IST)

అబ్బే.. జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దు.. రాజకీయ నాయకుడిని పెళ్ళాడను: కాజల్ అగర్వాల్

''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా గురించి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దని కాజల్ అగర్వాల్ తెలిపింది. రాజకీయ నాయకుడిని వివాహం చేసుకునే ఉ

''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా గురించి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దని కాజల్ అగర్వాల్ తెలిపింది. రాజకీయ నాయకుడిని వివాహం చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పకనే తెలిపింది. నిజ జీవితంలో జోగేంద్ర లాంటి భర్త కావాలని.. తాను వాస్తవ జీవితంలో రాధ వంటి అమ్మాయిని కాదని చెప్పింది.
 
బాహుబలి-2 తర్వాత వస్తున్న సినిమాలో రానా హీరోయిజంతో పాటు అద్భుతమైన నటనను కనబరిచారని కాజల్ ప్రశంసించింది. ఇదో వెరైటీ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. కేథరిన్‌తో తాను నటించిన సీన్లు నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో పెద్దగా లేవని తెలిపింది. కేథరిన్ పరిస్థితులకు వ్యతిరేకంగా మారే పాత్రలో నటించిందని.. అలాంటి పాత్రలు తనకు లభిస్తే తానెంతో హ్యాపీగా నటిస్తానని వెల్లడించింది.