బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (14:53 IST)

చోటా కే నాయుడు నన్ను ముద్దెట్టుకున్నప్పుడు షాక్ అయ్యా: కాజల్ అగర్వాల్

''కవచం'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ముద్దెట్టుకున్న వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కవచం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్‌ను వేదికపై అందరి ముందు కౌగిలించుకుని ముద్దెట్టుకున్న చోటా కే నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు కాజల్ అగర్వాల్ నోరు విప్పింది. 
 
ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. చోటా కే నాయుడు ఉన్నట్టుండి తనను ముద్దుపెట్టుకున్నప్పుడు అందరిలా తాను కూడా షాక్ అయ్యానని చెప్పింది. చోటా కే నాయుడు తనకు చాలా కాలంగా తెలుసని కాజల్ అగర్వాల్ తెలిపింది. 
 
తనపట్ల ఆయన ఏనాడూ చెడుగా ప్రవర్తించలేదన్న కాజల్.. అసలు ఆయనకు అటువంటి ఉద్దేశాలు కూడా లేవని చెప్పుకొచ్చింది. అదే రోజు వేదిక దిగిన వెంటనే తన వద్దకొచ్చిన చోటా కే నాయుడు.. తన ప్రవర్తన ఇబ్బంది పెట్టి వుంటే క్షమించు నాన్నా అని అడిగారని కాజల్ అగర్వాల్ తెలిపింది.