శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (20:19 IST)

ఏమయ్యా... నీకు బుద్ధి వుందా? టీనేజ్ కుమార్తెకి లిప్ టు లిప్ కిస్ ఇస్తావా?

పాశ్చాత్య సంస్కృతి అంతేనంటూ చాలామంది ఇప్పుడు మండిపడుతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే... ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ తన కుమార్తెకి లిప్‌కిస్ ఇచ్చాడు. అలా చేయడమే కాకుండా ఆ ఫోటోని తీసుకొచ్చి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టి అదేదో ఘనకార్యంలా ఫీలయ్యాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
పండగ క్రిస్మస్ సందర్భంగా ఈ ఫోటోను పోస్ట్ చేశాడు సదరు క్రీడాకారుడు. ఈ ఫోటో క్రింద క్రిస్‌మస్ రాబోతున్నది.. ఈ సందర్భంగా స్కేటింగ్ చేద్దాం అంటూ క్యాప్షన్ కూడా జత చేశాడు. ఐతే ఆ ఫోటోను చూసిన వెంటనే నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. 
 
ఏమయ్యా... నీకసలు బుద్ధి వుందా... ఆమె నీ కూతురు, ఆమె లిప్స్ మీద కిస్ చేస్తావా.. అలా నీ భార్యకు ఇవ్వు అని కామెంట్లు జోడిస్తున్నారు. మరోవైపు డేవిడ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అతడిని కాపాడేందుకు విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఓ మహిళా అభిమాని అయితే తన వయసు 35 ఏళ్లు, అయినప్పటికీ తన తండ్రికి చిన్నతనం నుంచి లిప్ కిస్ ఇవ్వడం చేస్తుంటాననీ, ఇప్పుడు కూడా అదే చేస్తున్నానంటూ కామెంట్ పోస్ట్ చేసింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి వుంది.