సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (08:58 IST)

క్లాస్‌రూమ్‌లో హగ్‌లు కిస్సులు... అయ్యోరు.. అయ్యోరమ్మ రాసలీలలు...

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే రాసలీలల్లో మునిగిపోయారు. ముఖ్యంగా విద్యార్థులను బయటకు పంపి.. తరగతి గదిలోనే ముద్దులు, కౌగిలింతల్లో మునిగిపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామ పాఠశాలలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని దహోద్ జిల్లా బామన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక్కడు ఓ ఉపాధ్యాడు, టీచరమ్మ పని చేస్తున్నారు. అయితే, పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ ఉపాధ్యాయుడు తోటి మహిళా ఉపాధ్యాయురాలిని కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించారు. ఈ టీచర్ల బాగోతాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై వెంటనే స్పందించిన గుజరాత్ విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వీడియోలో ఉన్న ఉపాధ్యాయులు ఎవరనే విషయం ఇంకా తెలియలేదని జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి వ్యాస్ చెప్పారు.