శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (10:16 IST)

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతుంటే..? తొమ్మిదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి..?

తొమ్మిదేళ్ల బాలికను అపహరించి.. కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో అమ్మ పక్కన ఆద మరచి నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను కామాంధులు అపహరించారు. బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఇంట్లో దొరికిన సొత్తంతా ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. 
 
బాలికను చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్లిన ముగ్గురు.. ఇంట్లోని సొత్తును కూడా దోచుకున్నారు. సంఘటన సమయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట పడుకుని ఉన్నారు. గురువారం వేకువజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనతో భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడిఉంది.
 
అల్మారాలో దాచిన రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైందని గమనించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.