శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (17:12 IST)

నెట్టింట వైరల్ అవుతున్న అసిన్‌ కుమార్తె ఫోటోలు వైరల్

అందాల ముద్దుగుమ్మ కేరళ కుట్టి అసిన్‌ కుమార్తె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 26న అసిన్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24న తన గారాలపట్టి తొలి పుట్టిన రోజు ఫోటోలను అసిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తల్లీకూతుళ్ల పుట్టినరోజు తేదీలకు మధ్య ఒక్కరోజు మాత్రమే గ్యాప్ వుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
 
కాగా అసిన్ కుమార్తె అరిన్ ఫస్ట్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో అమ్మ అసిన్ పోలికలతో అరిన్ చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 
కాగా బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్, శాండల్ వుడ్ ఇలా అన్నీ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అసిస్ తెలుగులో ''అమ్మ నాన్న తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, అన్నవరం, గజిని, దశావతారం వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2016 జనవరిలో తన బాయ్ ఫ్రెండ్, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మతో అసిన్ వివాహం జరిగింది. 
 
2017 అక్టోబర్‌లో పండంటి ఆడబిడ్డకు అసిన్ జన్మనిచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసిన అసిన్ పాప ఫోటోను మాత్రం లీక్ చేయలేదు. అయితే తాజాగా పాప ఫోటోను అసిన్ నెట్టింట షేర్ చేసింది.