దీపికను కాపురానికి తీసుకెళ్ళకుంటే చంద్ర సురేష్‌కు అది కోసేస్తాం - ట్రాన్స్‌జెండర్ హాసిని
వైజాగ్‌లో హిజ్రాను వివాహం చేసుకుని వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి బయటకు పంపేసిన భర్త చంద్ర సురేష్ పైన న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌జెండర్స్ అధ్యక్షురాలు హాసిని. విశాఖ కోర్టులో దీపికకు న్యాయం జరుగకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు.
6 లక్షల రూపాయల కట్నం, నగలును తీసుకుని ట్రాన్స్‌జెండర్ అని తెలిసి చంద్ర సురేష్ వివాహం చేసుకున్నారని, అయితే కొన్నిరోజులకే దీపికను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు ట్రాన్స్‌జెండర్స్. ట్రాన్స్‌జెండర్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రప్రకాష్ మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోకుంటే పళ్ళు రాలగొడతామని, అంతేకాదు నాలుక కోస్తామని హెచ్చరించారు.
దీపికకు తామంతా అండగా ఉన్నామని, ట్రాన్స్‌జెండర్ అని తెలిసే చంద్రప్రకాష్ వివాహం చేసుకున్నాడని, అన్నీ తెలిసి డబ్బులు కట్నంగా తీసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు హిజ్రాలు. గత నాలుగు రోజులుగా నిరసన చేస్తున్న దీపిక సమస్యపై ప్రజాప్రతినిధులు, పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు ట్రాన్స్‌జెండర్స్.