ప్రేమ జంటల ఏకాంతం కోసం లవ్ హోటల్స్... ఎక్కడ?
పూర్వకాలంలో రాజులు రాణి లేదా రాణి చెలికత్తెలు లేదా ఉంపుడుగత్తెలతో ఏకాంతంగా గడిపేందుకు ప్రత్యేకంగా ఏకాంత మందిరాలు ఉండేవి. వీటిలో తమకు ఇష్టమైనపుడు వచ్చి ఏకాంతంగా గడిపి, తమ శృంగార కోర్కెలను తీర్చుకుని వెళ్లేవారు. ఈ ఏకాంత మందిరాల్లోకి ఇతరులకు ప్రవేశం లేదు.
అలాగే, నేటి సమాజానికి అనుగుణంగా ఇపుడు ప్రేమికుల కోసం లవ్ హోటల్స్‌ను నిర్మించారు. ఇవి కేవలం ఏకాంతం కోరుకునే ప్రేమికుల కోసమే నిర్మించారు. జంటలు ఇందులో కొంతసేపు గడిపి వెళ్లిపోతుంటారు. ఇలాంటి హోటల్స్ జపాన్‌లో 30 వేల వరకు ఉన్నాయి. వీటికి రోజూ సుమారుగా 1.4 మిలియన్ ప్రేమ జంటలు వచ్చి ఉల్లాసంగా గడిపి వెడుతుంటారు.