మెర్సల్ హీరో ''సర్కార్'' ట్రైలర్ అదుర్స్.. వీడియో చూడండి
మెర్సల్ హీరో.. విజయ్, ప్రముఖ తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ''సర్కార్''. ఈ సినిమా దీపావళి కానుకగా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దసరా కానుకగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. టీజర్ విడుదలైన ఐదు గంటల వ్యవధిలోనే యూట్యూబ్‌లో మిలియన్‌కుపైగా లైక్స్ రావడంతో రికార్డు క్రియేట్ చేసింది.
సర్కార్ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ దళపతి విజయ్‌కి ఇది 62వ సినిమా కాగా, మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఇంతకుముందు కత్తి, తుపాకీ’చిత్రాలు తమిళనాట సూపర్ హిట్‌గా నిలిచాయి. కత్తి మూవీనే చిరు కమ్ బ్యాక్ సినిమా ''ఖైదీ నెం.150''గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్, మురుగదాస్ కాంబోలో వస్తున్న సర్కార్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే రికార్డులను తిరగరాస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి.