బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (17:02 IST)

ఆకాశ వీధుల్లో చిత్రం నుండి కాళ భైరవ ఆలపించిన పాటకు స్పంద‌న‌

aakaasa veedhullo
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వులేని ఏకాకిగా.. అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటకు పాపులర్ సింగర్ కాళ భైరవ గాత్రం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. జుడా శాండీ సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు.